Photo News: గ్రామీణ భారతం గిరిజనుల జీవనశైలి అన్న అంశంపై తీసిన డాక్యుమెంటరీ ఛాయా చిత్రాలకు ప్రపంచంలోనే పేరుగాంచిన అమెరికా పురస్కారం పట్టణానికి చెందిన వంగపల్లి బ్రహ్మయ్య దక్కింది అమెరికాలోని ఇమేజ్ కాలీగ్ సొసైటీ అసోసియేట్ షిప్ పుష్కరానికి ఎంపికైనట్లు తెలిపాడు .అరకు ఒరిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో మారుమూల ప్రాంతాల్లో నివాసం ఉండే గిరిజనుల జీవనశైలిపై దృష్టిసారించి అద్భుతమైన ఫోటో డాక్యుమెంటరీని బ్రహ్మయ్య రూపొందించారు. వీటిని ఇమేజ్ కాలిగ్ సొసైటీకి పంపగా న్యాయనిర్ణేతలు ముగ్ధులై అసోసియేషన్ ఆఫ్ ఇమేజ్ కొలీస్ సొసైటీ చైర్మన్ టోనీ లీ కిమ్ మెయిల్ ద్వారా ఇ సర్టిఫికెట్ పంపుతూ అభినందనలు తెలిపారు. గతంలో బ్రహ్మయ్య జాతీయస్థాయిలో అనేక అవార్డులు లభించాయి గత 20 ఏళ్లుగా వ్యాపార ఛాయాచిత్రాలు తీస్తూనే తన అభిరుచి మేరకు గ్రామీణ జీవనం లోని అందాలను ప్రపంచ ప్రేమికులకు నలుపు- తెలుపు తనదైన శైలు చూపిస్తున్నట్లు బ్రహ్మయ్య తెలిపారు. బ్రహ్మయ్య అంతర్జాతీయ పురస్కారం లభించడం పట్ల ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రఫీ అకాడమీ ప్రధాన కార్యదర్శి ఇ టి శ్రీనివాసరెడ్డి ,స్థానిక ఛాయా చిత్ర కారులు అభినందనలు తెలిపారు.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *