Photo news: తెలంగాణ రాష్ట్రంలోని ఫోటో&వీడియోగ్రాఫర్ లు lockdown సందర్భంగా వివాహ శుభకార్య క్రమాలకు కవరేజి కోసంవెళ్ళినప్పుడు ముహూర్తానికి వివాహం జరుగక పోవడం వలన ఆలస్యం అయినప్పుడు రాకపోకల లో పోలీసులు కొందరికి చలాన్లు వేస్తున్నారు, కొందరిపై కేసులు పెడుతున్నారు,కొందరి వాహనాలు సీజ్ చేస్తున్నారు. ఈ విషయాలన్నిగౌరవ సాంస్కృతిక శాఖ మంత్రి వర్యులు శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.కవరేజి కోసం వెళుతున్న ఫోటో మరియు వీడియో గ్రాఫర్ల ఐడీ కార్డు, కెమెరాల ను పరిశీలించి లాకడౌన్ సందర్భంగా సడలింపు యివ్వాలసిందిగా కోరడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఫొటో & వీడియో గ్రాఫర్ ల ను సూపర్ స్పైడర్ జాబితాలో చేర్చాలని, అందరికీ వెంటనే వాక్సినేషన్ పూర్తి చేయాలని కోరడం జరిగింది.దీనికి మంత్రిగారు సానుకూలంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.రేపు జరుగబోయే క్యాబినెట్ సమవేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లతనని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమం లో తెలంగాణ ఫోటో & వీడియో గ్రాఫర్ ల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సుంకిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ కో కన్వీనర్ బొలుగురి నాగరాజు పాల్గొన్నారు.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *