Photo News: ఈరోజు మానుకోట జిల్లా ఫోటో&వీడియో గ్రాఫర్స్ వేల్ఫేర్ అసోసియేషన్ వారు మరోమారు జిల్లా ఎస్పీ గారిని జిల్లా అధ్యక్షులు నీలం రమేష్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మోజు వెంకన్న చారి గారు జిల్లా కోశాధికారి గంగుల యాదగిరి గారు జిల్లా ఉపాధ్యక్షులు పల్లె శ్రీనివాస్ గార్లు ఫోటోగ్రాఫర్లు యొక్క ఇబ్బందుల గురించి SP గారికి విన్నవించడం జరిగినది ఈ లాక్ డౌన్ లో మ్యారేజ్ కవరేజ్ కొరకు వెళ్తున్న ఫోటో&వీడియో గ్రాఫర్ లను ఎలాంటి ఇబ్బందులు పెట్టకూడదని కోరడం జరిగింది వారు గతంలో అందరికీ ఇంఫర్మేషన్స్ ఇచ్చాం అన్నారు

నిన్న భూపతి పేట దగ్గర మన ఫోటోగ్రాఫర్ కు 1000/- రూపాయలు జరిమానా వేసిన విషయం వారికి వివరించాము విషయము విన్న SP గారు వారి PRO గారిని పిలిచి మళ్ళీ అన్ని చెక్ పోస్టులకు ఇన్ఫర్మేషన్స్ తెలియజేయమని చెప్పారు ఫోటోగ్రాఫర్ మిత్రులకు తెలియజేసే విషయమేమనగా మీరు తప్పనిసరి కెమెరాలు పెళ్లి కార్డు మరియు మానుకోట జిల్లా అసోసియేషన్ ఐడి కార్డును వెంబడి ఉంచుకోండి మీకు ఏమైనా చెక్ పోస్టుల వద్ద మిమ్ముల్ని ఆపి ఇబ్బందులు పెడితే మానుకోట జిల్లా PST లకు ఫోన్ చేయండి వెంటనే PRO గారితో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించడం జరుగుతుంది, SP గారు కోవిద్ -19 నిబంధనలు తప్పని సరి పాటించాలని చెప్పినారు, మానుకోట జిల్లా సభ్యత్వం లేని వారు త్వరగా సభ్యత్వం తీసుకొని ఐడి కార్డును పొందగలరు లేనిచో పోలీస్ శాఖ వారి తో ఇబ్బందులు పెడుతారు అని మానుకోట జిల్లా అసోసియేషన్ వారు ఒక ప్రకటనలో తెలిపారు

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *