Photo News: కరోనా మన ఫొటొగ్రఫి రంగాన్ని కుదిపివేసింది, మన రంగం లో ఉన్న అన్ని విభాగాలను కోలుకోకుండా చేసింది, గత సంవత్సరం కరెక్ట్ గా సీజన్ కి ముందు ఈ మాహా ప్రళయం ప్రపంచాన్ని కుదిపివేసింది..అందులో మన రంగం, మన సభ్యులు కూడా బలి అయ్యారు, ఎందరో కళాకారులను, మన తోటి మిత్రులను కోల్పొవాల్సి వచ్చింది…

ఇక కరోనా నుండి కొద్దిగా కోలుకుంటున్నాము మళ్ళి ఈ సీజన్ తో మళ్ళి పూర్వ వైభవంతో పెళ్ళిలు జరుగుతాయి మన రంగం గాడిన పడుతుంది అని అందరు భావిస్తున్న సమయంలో సెకండ్ వేవ్ తో మళ్ళి కరోనా విజృంబించినది..మళ్ళి దేశంలో లాక్డౌన్ ల పరంపర ప్రారంభం అయ్యి మన రంగాన్ని ఇక కోలుకోకుండా చేసింది.. కొన్ని వేల పెళ్ళిల్లు క్యాన్సిల్ అయ్యాయి..

*లాక్డౌన్ తో సమస్య*
ప్రభుత్వం 40మంది తో పెళ్ళిలు చేసుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చిన కారణంగా అక్కడ అక్కడ కొన్ని జరుగుతున్నా బడ్జెట్లు మాత్రం ఉహించని స్థాయికి పడిపోయాయి, కస్టమర్లతో ఉన్న అవినాభావ సంభందంతో కనీసం ఖర్చులకి అయినా వస్తాయి కదా అని తప్పని పరిస్తితుల్లో కరోనా విజృంబిస్తున్నా బయపడకుండా బయటకు వెళ్తున్నారు, పెళ్ళిలకి పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు పెళ్ళిలకి వెళ్తున్న మన సోదర ఫొటొగ్రఫి రంగ మిత్రులను ఆపి కొందరిని కొడుతూ, వెహికిల్స్ సీజ్ చేస్తూ, కెమెరాలు లాగేసుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారు, ఫొటొగ్రాఫర్లు అందరు బిక్కు బిక్కు మంటూ ప్రొగ్రాంస్ చేస్తూ, అసోసియేషన్ ఏమైనా చెయ్యలేక పోతుందా అని ఎదురు చుస్తున్నారు..

నిజానికి ఇక్కడ అసోసియేషన్ కూడా చేసేది ఏమి లేదు ..ఇంతకు ముందు ప్రతి జిల్లాలో ఎస్.పి మరియు కమీషనర్లకు వినతి పత్రం ఇస్తే సానుకూల స్పందన వచ్చింది కాని మారిన పరిస్థితుల్లో పోలిసులు ఎవ్వరి మాట వినట్లేదు.. మనమే ఏదొ చుసుకుంటూ వెళ్ళాల్సిందే….

*ఫొటొగ్రాఫర్లు*
వీరు వారు అని ఏమి తేడా లేదు అందరు ఇబ్బంది పడుతున్నారు, ఎంత చెట్టుకు అంత గాలి అని ఎవ్వరి బాధలు వారికి ఉన్నాయి.కాని కనీసం ఒక స్థాయి ఫొటొగ్రాఫర్లు ఈ రోజు కాకపోయినా ఒక్క సీజన్ మంచిగా చేస్థే కోలుకునే అవకాశం ఉంది.. కనీసం ఈ ఫీల్డ్లో ఉండగలడు కాని.. సామన్య ఫొటొగ్రాఫర్ పరిస్థితి మాత్రం దారుణం మన రంగం లో ఎవ్వర్కి సేవింగ్స్ ఉండవు.. ఏ సీజన్ డబ్బులు ఆ సీజన్లోనే ఉన్న కమిట్మెంట్స్ కి సరిపోతాయి.. ప్రతి సీజన్ వారికి క్రొత్తనే.. అలాంటి వారు ఇప్పుడు కనీస అవసరల్లు తీరక ఎవరిని డబ్బులు అడగాలో తెలియక చాల ఇబ్బంది పడుతున్నారు, వీరిలో కొంత మంది ఈ ఫీల్డ్ వదిలి వేసి పొయ్యే ప్రామదం ఉంది.. వీరి బ్రతుకు ఇప్పుడు ప్రశనార్ధకం అయ్యింది.. ఇక టేకర్స్ పరిస్థితి మాత్రం ఇక చెప్పనవసరం లేదు.. చాల మంది కరోనా బరిన పడినా సరి అయిన వైద్యం చేయించుకోవడానికి కూడా డబ్బులు లేక ఎవరైనా దాతలు సహయం చెయ్యకపొతారా.. అసోసియేషన్ ఆదుకుంటుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు..

*ఫొటొ స్టూడియోలు:*
సెల్ ఫోన్ రాకతో, ప్రభుత్వ ఆఫీసులలో ఆన్లైన్ పద్దతులు వచ్చాక గిరాకిలు లేక, అద్దేలు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నయి, కేవలం ఇప్పుడు వేరే పని చేసుకోలేక కొంత డబ్బులు జేభులో నుండి పడినా కనీసం ఒక అడ్డా అయినా ఉంటుంది కదా అని నడిపిస్తున్న వారు చాలా మంది ఉన్నారు..

ఇక కరోనా మరియు లాక్డౌన్ లతో మొత్తనికి మొత్తం స్టూడియోలు దివాళా తీస్తున్నయి, కనీసం ఇంతకు ముందు రోజుకు 500 నడిచిన స్టూడియోలు ఇప్పుడు 100 రూపాయలకి పడిపోయినాయి దానితో అద్దే ఎలా కట్టలా, ఇంటిని ఎలా నడిపియ్యలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.. అతి త్వరలో కొన్ని వేల స్టూడియోలు ముసివేసే పరిస్థితి నెలకొంది.. వారు అందరి జీవనోపాది ఇప్పుడు ప్రశ్నార్ధకం అవుతంది

*డిజి ప్రెస్*
రాష్ట్ర ఫొటొగ్రాఫర్లకు డిజి ప్రెస్ రూపంలో కొన్ని కొట్ల రూపయల పెట్టుబడి పెట్టి, కొన్ని వందల మంది కి జీవనోపాధి కల్పిస్తూ ఫొటొగ్రాఫర్లకు ఎప్పటికప్పుడు నూతన టెక్నాలజీ ని పరిచయం చేస్తూ తమ సేవలను అందిస్తున్న డిజి ప్రెస్ సంస్థల మనుగడ ఇప్పుడు ప్రశ్నార్ధకం అయ్యింది.. నెల వారి జీతలు చెల్లించలేక.. లక్షల అద్దెలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారు, ముడి సరుకు ధరలు విపరీతంగా పెరిగినవి, వాటితో పోల్చుకుంటే దాదపు ఒక షీట్ కి 20 రూపయలు పెంచాల్సిన సంధర్భం వచ్చింది కాని ఒక వేళ పెంచితే ఫొటొగ్రాఫర్లు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే భయం తో ఉన్నారు ఇలానే ఇంకా కొన్ని నెలలు కొనసాగితే సగానికి పైగా డిజి ప్రెస్ లు మూత పడిపోవడం ఖాయం.. చుస్దాం ఏమి అవుతుందో…

*వివిధ ట్రేడర్స్*
ఈ రంగం పై ఆధర పడి జీవిస్తున్న పలువురు ట్రేడర్స్, ఎల్.ఈడి వాల్ యజమానులు, వివిధ సర్వీసులు అందించే వారు పెట్టిన పెట్టుబడులకు వడ్డి కట్టలేక, అద్దేలు చెల్లించలేక, కనీసం జీతలు చెల్లించలేక చాల ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడ పని చేసే సిబ్బంది దాదాపు సగానికి పైగా నిరుద్యోగులు అయ్యారు..

ఇలా అన్ని రంగాలు దెబ్బ తిని ఉన్నాయి.. ఇప్పటికిప్పుడు సాధరణ పరిస్థితులు నెలకొన్నా కూడా.. అన్ని రంగాలు తిరిగి కోలుకోవడానికి మాత్రం ఎంత లేదు అన్నా 2 సంవత్సరాలు పడుతాయి

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *