Photo News: పెండ్లి కార్యక్రమాల ఫోటో మరియు వీడియో కవరేజ్ చేసి వస్తున్న ఫోటో గ్రాఫర్లకు కరోనా విజృంభిస్తున్న నేపథ్యం లో లాక్ డౌన్ కారణంగా కొంత సడలింపు ఇవ్వగలరని కోరుతూ కరీంనగర్ పట్టణ ACP అశోక్ గారు మరియు రూరల్ ACP విజయసారథి గారిని కలిసి కరీంనగర్ జిల్లా ఫోటో మరియు వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సిరి రవి , పట్టణ అధ్యక్షులు కొప్పుల కనకారావు,సుంకే ఆనంద్ బాబు,ప్రేమ్ గార్లు కలసి వినతి పత్రం ఇవ్వడం జరిగినది.

ఇట్టి వినతి పత్రానికి సానుకూలంగా స్పందించి మీ ఫోటో మరియు వీడియోగ్రాఫర్లకు మా పోలీస్ సిబ్బంది తో ఏదైనా ఇబ్బంది కలిగినచో మమ్మల్ని సంప్రదించవచ్చని భరోసా ఇచ్చినటువంటి ACP గార్లు ఇరువురికి కరీంనగర్ జిల్లా ఫోటో మరియు వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ తరపున ధన్యవాదములు తెలపడం జరిగినది.

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *