Foto tech News : చిత్తూరు జిల్లా తిరుపతిలో ఫోటో మరియు వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ 2వ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ రఘురాం గారు, శ్రీ కన్నన్ గారు, శ్రీ శ్రీనివాస్ గారు, శ్రీ ఓం ప్రకాష్ గారు, శ్రీ మాదల రమేష్ గారు, శ్రీ కృష్ణ ప్రసాద్ (కిట్టు) గారు, శ్రీ మోహన్ రాజు గారు, శ్రీ నిమ్మగడ్డ సతీష్ కుమార్ గారు, శ్రీ శివ శంకర్ గారు, శ్రీ గెల్లా రాజుగారు, శ్రీ సుబ్రహ్మణ్యం గారు, శ్రీ శేషు గారు, శ్రీ అద్దంకి వాసు గారు, శ్రీ రామకృష్ణ గారు, శ్రీ నట శేఖర్ గారు, శ్రీ సురేష్ గారు, శ్రీ వెంకట రత్నం గారు, శ్రీ రాజన్న గారు, శ్రీ సుబ్బారెడ్డిగారు వేదికను అలంకరించినారు.

      జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అనంతరం చిత్తూరు జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వారి 2021 డైరీ ఆవిష్కరించారు. సంక్షేమ సంఘం ట్రెజరర్ శ్రీ నిమ్మగడ్డ సతీష్ కుమార్ గారు 2020-2021 సంవత్సరంలో సంక్షేమ సంఘం ద్వారా జరిగిన  అన్ని కార్యక్రమలు వివరించారు. ఆ తరువాత వర్క్కింగ్ ప్రెసిడెంట్ కిట్టుగారు, సెక్రటరీ పి.మోహన్ రాజ్ గారు, మరియు ప్రెసిడెంట్ మాదల రమేష్ గారు సభను ఉద్దేశించి ప్రసంగించారు.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *